News November 19, 2025

సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

image

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.

Similar News

News January 23, 2026

రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా ఫస్ట్

image

గంజాయిని నివారించడంలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కీ పెర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 76.2 శాతంతో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బాపట్ల జిల్లాలో ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ ముందు వరసలో నిలపటం పట్ల ఈగల్ DIG రవికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

News January 23, 2026

భర్తను చంపిన భార్య.. కీలక విషయాలు

image

AP: గుంటూరు(D) దుగ్గిరాలలో భర్తను భార్య చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన <<18921625>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగరాజే తనకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేశాడని విచారణలో భార్య మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన బిడ్డ అలా చేసుండదని, ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారని మాధురి తల్లి బీబీసీ వద్ద వాపోయారు. కాగా ప్రియుడు గోపీతో కలిసి భర్త నాగరాజును మాధురి హత్య చేసినట్లు కేసు నమోదైంది.

News January 23, 2026

విశాఖ: 4 రోజులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

image

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని‌ కలెక్షన్ కౌంటర్లు 24 నుంచి 27వ తేదీ వరకు అనగా.. శని, ఆది, సోమ, మంగళ వారాలలో కూడా పనిచేస్తాయని విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనూ, ఈ-సేవ, మీసేవ కౌంటర్లలో చెల్లించుకోవచ్చని ప్రకటించారు.