News September 10, 2025

సామర్లకోట: ఉచిత బస్సు పథకం రద్దు కోరుతూ పాదయాత్ర

image

ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ విశాఖపట్నం నుంచి అమరావతికి చింతకాయల శ్రీనివాసరావు అనే ఆటో కార్మికుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం సామర్లకోటకు చేరింది. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో ఆటో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని శ్రీనివాస్ కోరారు.

Similar News

News December 12, 2025

ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

image

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News December 12, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 79.57 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.