News March 11, 2025

సామర్లకోట: పరీక్ష రాసేందుకు వెళ్తూ మృతి

image

సామర్లకోట మండలం ఆర్సీపాలెనికి చెందిన వంశీ (19) సోమవారం కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాసేందుకు స్నేహితుడు సాయిగణేష్‌తో బైక్‌పై వెళ్లాడు. గొంచాల వద్ద బైక్ అదుపుతప్పి వెనుక కూర్చున్న వంశీ రోడ్డుపై పడ్డాడు. వెనకనుంచి వస్తున్న ట్రాక్టర్ వంశీ తలపై నుంచి వెళ్లిపోవడంతో మృతిచెందాడు. భర్త చనిపోయిన ఆ తల్లికి కొడుకు అండగా ఉన్నాడని ధైర్యంగా ఉంది. ఇప్పుడు అతడు మృతితో ఆ తల్లి బాధ వర్ణనాతీతమైంది.

Similar News

News January 17, 2026

విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 17, 2026

IIIT హైదరాబాద్ బంపర్ ఆఫర్: ఇంటి నుంచే డేటా సైన్స్‌లో మాస్టర్స్!

image

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్‌ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT