News November 19, 2025

సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

image

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Similar News

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

image

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.

News January 14, 2026

జర్నలిస్టుల అరెస్టులు.. KTR సంచలన వ్యాఖ్యలు

image

జర్నలిస్టుల అరెస్టు విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని KTR ఖండించారు. ‘మీ మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రి ముగ్గురు జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అపహరించారు. పోలీసులు జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఇది కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు, పోలీసులు BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు’ అని Xలో ఖండించారు.

News January 14, 2026

HYD: ఇథియోపియా కాఫీకి ఇంత చరిత్ర ఉందా?

image

మనం రోజూ తాగే కాఫీ వెనుక ఓ అద్భుత కథ దాగి ఉంది. ఇథియోపియాలో 11వ శతాబ్దంలో మేకల కాపరి కఫా కొండ ఎక్కాడు. మేకలు చెర్రీలాంటి పండ్లు తిని ఉల్లాసంగా నర్తిస్తున్నాయని అతడు గమనించాడు. ఆశ్చర్యంతో అతడు గింజలను వేడి నీటిలో మరిగించి తాగగా, అపూర్వమైన ఉల్లాసాన్ని అనుభవించాడు. అదే కాఫీ. మన దేశానికి పరిచయం చేసింది మాత్రం అరబ్బులు. <<18855272>>పరేడ్ గ్రౌండ్<<>> స్వీట్ ఫెస్టివల్‌లో ఈ కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.