News November 20, 2025
సింగపూర్‌కి ప్రభుత్వ టీచర్లు పయనం.. ఏం చేయబోతున్నారంటే.?

సింగపూర్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు APకి చెందిన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సిద్ధమైంది. వీరు NOV 27-DEC 2 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, బోధనా పద్ధతులను వీరు పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు వీరు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ బృందం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పయనం కానుంది.
Similar News
News January 14, 2026
సిద్దిపేట: ‘కుల వివక్షతో యువ డాక్టర్ ఆత్మహత్య’

సిద్దిపేట మెడికల్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ లావణ్య ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. సీనియర్ డాక్టర్ ప్రణయ్ ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రస్తావన రాగానే కులం పేరుతో నిరాకరించడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్, డీబీఎఫ్ నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.
News January 14, 2026
సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.


