News July 7, 2024
సింగపూర్‌లో కోదాడ యువకుడి అనుమానాస్పద మృతి

కోదాడకి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ బీచ్‌లో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. కోదాడలో ఉన్న తల్లిదండ్రులు పవన్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి తండ్రి శ్రీనివాసరావు కోదాడలో నూనె వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో కుమారుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.
Similar News
News December 16, 2025
NLG: 38 మందిపై కేసు.. ఆ గ్రామంలో పోలీస్ పికెట్

నిడమనూరు(M) సోమోరిగూడెంలో జరిగిన ఉద్రిక్తతకు కారకులైన 38మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం రాత్రి BRS నాయకులు, పోలింగ్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు సోమోరిగూడెం వచ్చి ఘర్షణకు పాల్పడిన వారిని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో BRS వర్గీయులు ఎన్నికల సామాగ్రి పోస్టర్లు చించివేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
News December 16, 2025
వైష్ణవ ఆలయాల్లో నేటి నుంచి ధనుర్మాసం

జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు ధనుర్మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. నేటి నుంచి జనవరి 14 వరకు వేంకటేశ్వరస్వామి, శ్రీరామ మందిరాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మాసంలో రోజూ తెల్లవారుజామున తులసి మాల కైంకర్యం, గోదాదేవి రచించిన పాశురాల పఠనం నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో పుష్పాలంకరణలు, పల్లకీ సేవలు నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
News December 15, 2025
నల్గొండ జిల్లాలో ఈనాటి ముఖ్యాంశాలు

నల్లగొండ : మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమేజేషన్
నల్గొండ: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా సాత్విక
చిట్యాల : డంపింగ్ యార్డుతో ఇబ్బందులు
నాంపల్లి : చెరువు నిండా వ్యర్థాలే
అనుముల : సాఫ్ట్వేర్ టు సర్పంచ్
దేవరకొండ : ముగిసిన మూడో విడత ప్రచారం
నకిరేకల్ : సర్పంచులకు సమస్యల స్వాగతం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?


