News May 7, 2025

సింగరేణిలో అద్దె వాహనాలకు టెండర్లు: జీఎం

image

బెల్లంపల్లి ఏరియాలోని పలు గనులు డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నడపడానికి భూనిర్వాసితులు టెండర్లు వేసుకోవాల్సిందిగా ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. 3, 5 ఏళ్ల పాటు వాహనాలు అద్దె ప్రాతిపదికన నడపాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను మే 14వ తేదీలోగా జీఎం కార్యాలయంలో సమర్పించాలన్నారు?

Similar News

News February 7, 2026

నారాయణపేటలో ‘త్రిముఖ’ పోరు

image

నారాయణపేట మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ గెలుపు కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మాజీ మంత్రులు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక బీఆర్ఎస్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి భుజాన వేసుకున్నారు. అగ్రనేతల ప్రచారంతో పేటలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.

News February 7, 2026

మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

News February 7, 2026

రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. జపాన్ మ్యాగజైన్‌పై సోలో ఫొటో

image

రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన పాపులర్ లైఫ్‌స్టైల్ వీక్లీ మ్యాగజైన్ ‘Anan’ ఫిబ్రవరి ఎడిషన్‌ బ్యాక్ కవర్‌పై సోలోగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత జపాన్‌లో ఏర్పడిన భారీ ఫ్యాన్‌బేస్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. గతంలో ‘RRR’ సక్సెస్ తర్వాత 2023లో రామ్‌చరణ్, NTR కలిసి కవర్‌పై కనిపించగా, ఈసారి ప్రభాస్ సోలోగా మెరిశారు.