News November 6, 2025
సింగరేణి అధికారులకు సీఎండీ సూచనలు

మైనింగ్ తో పాటు అన్ని శాఖల అధికారులు బాగా పనిచేయాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని, పనితీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. గురువారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షలో సూచనలు చేశారు. వివిధ కార్పోరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు ప్రత్యక్షంగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

TG: దావోస్‌లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.
News January 21, 2026
మెదక్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News January 21, 2026
SRPT: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ తేజస్

లైసెన్స్‌డ్ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులకు అపారమైన నమ్మకం కలిగేలా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ సర్వేయర్లతో ఆయన సమావేశమయ్యారు. ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలకు నూతన నైపుణ్యంతో కచ్చితమైన కొలతలు వేసి, నివేదికలు అందించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు.


