News February 11, 2025
సింగరేణి డైరెక్టర్‌గా శ్రీరాంపూర్ GM

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎంగా పనిచేస్తున్న ఎల్వి సూర్యనారాయణ సింగరేణి డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. సోమవారం HYDలో సింగరేణి 2 డైరెక్టర్ పదవుల కోసం 10 మంది అధికారులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూల్లో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ నూతన డైరెక్టర్(P&P)గా ఎంపికయ్యారు. కార్మిక సంఘాల యూనియన్ నాయకులు, శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 19, 2026
T20 WC: ఇవాళ 3 మ్యాచులు

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు వెస్టిండీస్- ఇటలీ, 3PMకు శ్రీలంక-జింబాబ్వే, 7PMకు అఫ్గాన్-కెనడా ఆడనున్నాయి. ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు అయ్యాయి. దీంతో నేటి మ్యాచులు నామమాత్రమే. రేపు ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 21 నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22న సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.
News February 19, 2026
SKLM: కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి.. PHOTO

శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో పెద్దకుమారుడు రాజు మృతి చెందగా, కన్నతల్లే కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. గతంలో చిన్నకుమారుడు మరణించగా తండ్రి తలకొరివి పెట్టారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా దూరమవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై కొడుకుకు వీడ్కోలు పలికింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
News February 19, 2026
కోడి రెక్క ఆరబెడితే గొప్ప వర్షం

వర్షం పడబోయే ముందు గాలిలో తేమ పెరగడంతో పాటు వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. కోళ్లు వీటిని గ్రహించి తమ రెక్కలను విరబోసుకుని (ఆరబెట్టినట్లుగా) ఆడిస్తాయట. కోళ్లు అలా ప్రవర్తిస్తే, త్వరలోనే భారీ వర్షం కురుస్తుందని గ్రామాల్లోని ప్రజలు నమ్మేవారట. దీంతో పాటు నల్ల చీమలు వరుసగా వెళ్లటం, కప్పల బెకబెకలను విని.. వ్యవసాయ పనుల కోసం సిద్ధమయ్యే రైతులు తమ ధాన్యాన్ని, ఇతర వస్తువులను భద్రపరుచుకొనేవారట.


