News November 19, 2025
సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు: కలెక్టర్

సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల డ్వామా కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 686 దరఖాస్తులు రాగా, 652 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు.
Similar News
News January 19, 2026
గణతంత్ర పరేడ్‌లో కీరవాణి నాదం.. తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవం!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత కీరవాణి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరనుంది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 2500 మంది కళాకారులు ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగం కానున్నారు. ఈ విషయాన్ని కీరవాణి X వేదికగా వెల్లడించారు.
News January 19, 2026
ముంబై మేయర్ పీఠం BJPకి దక్కేనా?

ముంబై మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపోల్స్ ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన BJPకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 227 వార్డుల్లో బీజేపీ (89), శివసేన (29) కూటమి 118 సీట్లు సాధించింది. 28న జరిగే కౌన్సిలర్ల మీటింగ్‌లో మేయర్‌ను ఎన్నుకోనున్నారు. శివసేన (UBT) 65, MNS 6, కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, మిగిలిన చోట్ల ఇతరులు విజయం సాధించారు.
News January 19, 2026
గంగవరం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం?

గంగవరం(M) డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. నిత్యం కాలేజీ విద్యార్థులు, బయట ప్రాంతాల నుంచి విటులు రావడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


