News August 11, 2025

సింగూరులోకి 5,170 క్యూసెక్కుల వరద

image

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 5,170 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వచ్చినట్లు ఏఈ అంథోనీ సోమవారం తెలిపారు. 633 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలకు గాను 21.651 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు.

Similar News

News March 14, 2026

మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

image

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.

News March 14, 2026

CTR: వాటర్ బాటిల్ ధరల పెంపు ఇందుకే.!

image

ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ‘పాలిమర్’ వాటర్ బాటిల్ తయారీకి కీలకం. యుద్ధ నేపథ్యంలో చమురు రేట్లు పెరగటంతో పాలిమర్ రేట్లు సైతం 50% మేర పెరిగాయి. ఇక వాటర్ బాటిల్ క్యాప్ ధర కూడా దాదాపు రూ.0.50 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో పాలిమర్ KG ధర రూ.160-180 మధ్య ఉంది. ఇంతకు ముందు ఇది రూ.10లోపే ఉండేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో దుకాణాల్లో <<19382920>>వాటర్ బాటిల్స్<<>> ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.

News March 14, 2026

IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్‌గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్‌లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్‌లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.