News November 30, 2025
సింహాచలంలో ఐదు రోజుల పాటు ఆర్జీత సేవలు రద్దు

సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదలుకొని ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ సుజాత తెలిపారు. ఈ మేరకు నవంబర్ 30నుంచి డిసెంబర్ 4వరకు ఆలయంలో ప్రతి రోజు జరిగే ఆర్జీత సేవలు రద్దు చేశారు. దర్శనాలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలన్నారు.
Similar News
News February 17, 2026
బీర పంటలో మంచి దిగుబడి, ధర రావాలంటే..

బీర విత్తనాలను నాటిన తర్వాత మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. దీని వల్ల ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే విత్తనం రకాన్ని బట్టి బీర పంట 60 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. ముదిరితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి.
News February 17, 2026
రికార్డుల వేట.. ఎగవేతదారుల కోటలకు బీట!

సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఆస్తి పన్ను లెక్కల్లో మాయాజాలం చేసిన వారికి కాలం చెల్లింది. అద్దె విలువను (ARV) తక్కువ చూపిస్తూ పన్ను ఎగ్గొట్టే బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు సర్కార్ ‘డిజిటల్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. ఇంటి పన్ను పత్రం, కరెంటు మీటర్, రిజిస్ట్రేషన్ డేటా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇళ్లు అని చెప్పి సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, హాస్టళ్లు నడిపేవారికి కరెంటు బిల్లులే సాక్ష్యంగా మారుతున్నాయి.
News February 17, 2026
కామారెడ్డి: రాజకీయ అనుభవం లేని ఛైర్‌పర్సన్

కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణికి రాజకీయ అనుభవమేమీ లేదు. ఆమె భర్త ఇప్ప శ్రీనివాస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె BSc, BEd వరకు చదువుకున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వారి కుటుంబానికి BRSతో అనుబంధం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. భర్త ఇప్ప శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాణిస్తున్నారు. ఆమె స్వగ్రామం రాజంపేట.


