News May 24, 2024
సింహాచలం: నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
Similar News
News February 19, 2025
విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 19, 2025
వైస్ ఛాన్స్‌లర్లుగా ఏయూ ఆచార్యులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు.
News February 19, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం: కలెక్టర్

లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.