News September 23, 2024
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు
సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News October 15, 2024
పెందుర్తిలో దారుణం.. తండ్రిని చంపేసిన కొడుకు
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ సమీపంలోని మన్యం కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు. దసరా నుంచి మద్యం సేవిస్తూ గొడవ పడుతున్న గోపి.. తండ్రి దేముడును మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో పీక కోసేశాడు. సంఘటన స్థలములోనే దేముడు మృతి చెందగా.. స్థానికుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు ఘటనాస్థలంలో గోపిని అదుపులో తీసుకున్నారు.
News October 15, 2024
ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు వీరే..!
అనకాపల్లి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కొల్లు రవీంద్రను ప్రభుత్వం నియమించింది. జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా బాల వీరాంజనేయులును ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన హోం మంత్రి అనితను విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా, అల్లూరి జిల్లాకు గుమ్మడి సంధ్యారాణిని ఇన్ ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం నియమించింది.
News October 15, 2024
ముత్యాలం పాలెం బీచ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అనకాపల్లి పరవాడ మండలం ముత్యాలపాలెం బీచ్‌లో గుర్తుతెలియని మృతదేహం ఒకటి నేడు లభ్యమైంది. మృతదేహం పూర్తిగా అస్థిపంజరాలుగా మారింది. మృతుడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా, ఫ్లై ఈగల్ పచ్చబొట్టు చేతిపై ఉంది. సంఘటన స్థలానికి పరవాడ పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పచ్చబొట్టు ఆధారంగా మృతుని బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు.