News April 26, 2024
సికింద్రాబాద్‌లో ACB రైడ్స్

సికింద్రాబాద్‌లో ACB అధికారులు రైడ్స్ చేశారు. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏకంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉప్పల్‌లో బిల్డింగ్‌కు NOC ఇచ్చేందుకు DEE పవన్ కుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ACB దాడులు చేసి అరెస్ట్ చేసింది. న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లంచం అడిగితే వెంటనే 1064కి కాల్ చేయాలని ACB Telangana పేర్కొంది.
Similar News
News April 14, 2026
HYD: ఇన్ఫెక్షన్ పెరుగుతోంది.. జాగ్రత్త!

HYDలోని CCMB తాజా అధ్యయనంలో కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియాల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతున్నట్లు వెల్లడైంది. పరిశోధనలో 45% బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకంగా మారినట్లు గుర్తించారు. క్లెబ్సియెల్లా, న్యుమోనియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతుల్లో ఈ ప్రతిరోధక శక్తి ఎక్కువగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్‌ను తట్టుకోగల శక్తిగా మారాయని తేలింది.
News April 14, 2026
HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.