News September 11, 2025
సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.
Similar News
News December 8, 2025
VKB: ‘ప్రజావాణి’ సమస్యలకు త్వరిత పరిష్కారం: అ.కలెక్టర్

‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి, ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 8, 2025
సూపర్ ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్‌లో త్రిపుర థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా, త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌లో TRI 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ ఆల్‌రౌండ్(35 బంతుల్లో 69 పరుగులు, 2 వికెట్లు; సూపర్ ఓవర్‌లో 5 రన్స్, 1 వికెట్) ప్రదర్శనతో అదరగొట్టారు.
News December 8, 2025
AI నియంత్రణపై ఆస్ట్రేలియా ఫోకస్..

16 ఏళ్లలోపువారు SM వాడటంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు AI నియంత్రణపై దృష్టి పెట్టింది. కొత్త చట్టాలు చేయకుండా, అమలులో ఉన్న చట్టాలతోనే AIతో వచ్చే సమస్యల పరిష్కారానికి 2026 నాటికి భద్రతా సంస్థ ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ అభివృద్ధితో పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి సంస్థ పనిచేస్తుంది. డేటా సెంటర్లకు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రజాభద్రత టార్గెట్‌గా పెట్టుకున్నట్టు చెప్పింది.


