News December 13, 2024
సికింద్రాబాద్: గాంధీ హాస్పిటల్ వద్ద ఆంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734080842948_50019157-normal-WIFI.webp)
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి పోలీసులు ఎవరినీ డైరెక్ట్‌గా అనుమతించడం లేదు. సినీ హీరో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం పేషెంట్లు, వారి సహాయకులు, డాక్టర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వారి ఐడీ కార్డు చూసి నిర్ధారించుకున్న తర్వాతనే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. 15 నుంచి 20 నిమిషాల్లో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తికానున్నట్లు సమాచారం.
Similar News
News January 25, 2025
HYD: KCR చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి చేశారు: ఎంపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737792567365_52296546-normal-WIFI.webp)
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలని, అప్పుడే అన్నీ సజావుగానే కనిపిస్తాయని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ..కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్‌లో మంత్రివా లేక KCR ఫామ్ హౌస్‌లో పాలేరువా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10ఏళ్లలో KCR చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలోనే చేసి చూపించారని, KTRతేలేని పెట్టుబడులను తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తున్నామన్నారు.
News January 25, 2025
ఊరించడమే కాంగ్రెసోళ్ల పని: కుత్బుల్లాపూర్ MLA
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737798786542_718-normal-WIFI.webp)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. నేడు, రేపు, మాపు అంటూ ఊరించడమే కాంగ్రెసోళ్ల పని అని, రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం..! అదిగో ఇస్తాం..! అంటూ ఊరిస్తున్నారే తప్ప, అర్హులకు అందించడం లేదన్నారు. పేదలకు పథకాలు అందకపోతే, కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు.
News January 25, 2025
HYD: మూసీ ప్రాజెక్ట్, మురుగు శుద్ధీకరణపై UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737799752382_718-normal-WIFI.webp)
మూసీ ప్రాజెక్ట్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మురుగు శుద్ధీకరణపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. HYDలో 55KM మూసీ నది పొడవునా ఇరువైపులా మొత్తంగా 110 కిలోమీటర్లలో కాలువలు, బాక్స్ డ్రైన్ నిర్మాణాలు, STP నిర్మాణాలకు రూ.10,000 కోట్లు.. HYD సమీప 27 పట్టణ, నగర పాలక సంస్థల పరిధిలో డ్రైనేజీ నెట్ వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (CSMP)కు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరింది.