News February 9, 2025

సికింద్రాబాద్: షాపింగ్‌ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

image

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్‌ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 7, 2026

రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

image

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.

News February 7, 2026

APPLY NOW: C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.

News February 7, 2026

కవలలకు రామ-లక్ష్మణ అనే పేర్లేందుకు పెడతారు?

image

రామాయణంలో లక్ష్మణ, శత్రుఘ్నులు మాత్రమే కవలలు. అయినప్పటికీ రామలక్ష్మణుల బంధమే అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకు అనేక కారణాలున్నాయి. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెన్నంటే ఉన్నాడు. అవసరం లేకపోయినా అడవులకెళ్లాడు. యుద్ధం చేశాడు. ఈ అసాధారణ సోదర ప్రేమ, ఐక్యత కారణంగానే కవలలు పుట్టినప్పుడు వారు కూడా అలా కలిసి ఉండాలని రామ-లక్ష్మణ అనే పేర్లు పెడతారు. ఇది పుట్టుక కన్నా వారి మధ్య ఉన్న బంధానికి ఇచ్చే గౌరవం.