News December 2, 2025

సిద్దవటం: ఘట్కా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక

image

సిద్దవటం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీ విద్య ఘట్కా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీత, పీడీ చంద్రావతి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో శ్రీవిద్య ప్రతిభ కనబరచిందన్నారు. ఈ మేరకు పంజాబ్‌లోని లూథియానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యిందన్నారు.

Similar News

News February 7, 2026

నల్గొండ: మున్సిపోల్స్‌లో ‘నోట్ల’ వర్షం

image

NLG కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో ఎన్నికల ఖర్చు చుక్కలను తాకుతోంది. 427 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఒక్కో వార్డులో సగటున రూ.40 నుంచి 50 లక్షల వరకు వ్యయం చేస్తున్నట్లు అంచనా. ఓటర్లకు తాయిలాలు, మద్యం, క్యాంపు రాజకీయాలు అన్నీ కలిపి జిల్లావ్యాప్తంగా ఈ ఖర్చు రూ.200 కోట్లు దాటవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

News February 7, 2026

RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్‌

image

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను ఊహించుకున్నారనే మీమ్‌ను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.

News February 7, 2026

సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

image

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్‌వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.