News September 11, 2025

సిద్దిపేట: ‘అడ్మిషన్లకు 12 చివరి తేదీ’

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 12 చివరి తేదీ అని సిద్దిపేట రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోసం అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 11, 2025

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

*పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
*సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
*AP ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
*రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
*SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
*కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం

News December 11, 2025

చింతలకుంట తండా సర్పంచిగా జాటోత్ రవి

image

తిరుమలగిరి మండలం చింతలకుంట తండా గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి జాటోత్ రవి 19 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి సోమ నరసయ్యపై గెలుపొందారు. రవి మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్‌, బీఆర్ఎస్ మండల, గ్రామ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి మీ గ్రామంలో ఎవరు గెలిచారో కామెంట్ చేయండి..!

News December 11, 2025

వర్ధన్నపేట: ఫలితం డ్రా.. చిట్టీలు వేసి ప్రకటన

image

వర్ధన్నపేట మండలంలోని అంబేడ్కర్ నగర్‌లో 1వ వార్డు ఫలితాన్ని డ్రా ద్వారా నిర్ణయించారు. ఈ వార్డులో మొత్తం 101 ఓట్లు ఉండగా 91 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు దారురాలు బొక్కల రజనీకి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు 31 ఓట్లు రావడంతో సమాన ఫలితం నమోదైంది. దీంతో నియమాల ప్రకారం ఎన్నికల అధికారులు చిట్టీలు వేసి విజేతను నిర్ణయించారు. గోకల రూపకు అదృష్టం వరించి విజేతగా నిలిచింది.