News August 12, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పై సమీక్ష

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ ప్రక్రియ గూర్చి ఏంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ సమావేశాన్ని కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ ప్రక్రియ వేగం పెంచాలని తెలిపారు. మార్కింగ్ చేశాక బేస్ మెంట్ లెవెల్‌లోకి రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలని, బేస్‌మెంట్ లెవెల్ అయ్యాక ఇంజినీరింగ్ అధికారులు విజిట్ చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
చలో స్టేషన్ ఘన్‌పూర్.. భారీగా తరలివెళ్లిన బీఎస్పీ శ్రేణులు

మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహిస్తున్న ‘చలో స్టేషన్ ఘన్‌పూర్’ సభకు పెద్దపల్లి జిల్లా నుండి BSP శ్రేణులు భారీగా తరలివెళ్లారు. BSP జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ యాదవ్, మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంనుండి బస్సుల్లో బయలుదేరారు. కాన్షీరామ్ ఆశయ సాధన కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.
News March 15, 2026
వనపర్తి: పీఆర్సీని అమలు చేయాలి: తపస్

ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, శశివర్ధన్‌లు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆదివారం MLA మేఘారెడ్డికి ఆయన నివాసంలో యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. పీఆర్సీ పైన ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని, అలాగే పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరప్రసాద్ గౌడ్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
News March 15, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


