News April 26, 2024
సిద్దిపేట: ఈతకు వెళ్లి బాలుడి మృతి

ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. SI ప్రేమ్‌దీప్ వివిరాలు.. మనోహరాబాద్ మండలం పాలటకు చెందిన నితిన్(10) దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మతో కలిసి బుధవారం దౌల్తాబాద్‌లో పెళ్లికి వెళ్లిన నితిన్ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వచ్చాడు. వారు వచ్చేసరికే ఇంటి వద్ద మనవడు లేకపోవంతో స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామంలోని చెరువులో నితిన్ మృతదేహం తేలింది.
Similar News
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.