News December 1, 2025
సిద్దిపేట: ఎయిడ్స్ వ్యాధికి నివారణే ఆయుధం: DMHO

ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే ప్రధాన ఆయుధం అని సిద్దిపేట DMHO ధనరాజ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్బంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చెసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి అవగాహనతోనే నివారించవచ్చాన్నారు.
Similar News
News February 18, 2026
గూడూరులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాలు.. బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన పొడుగు నరసయ్య(60) జగన్ నాయకులగూడెంలోని తన కూతురు వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈక్రమంలో బొద్దుగొండ పెట్రోల్ బంకు వద్ద, అతివేగంతో ద్విచక్ర వాహనంపై వస్తున కంబాలపల్లికి చెందిన పెద్ద మామూలు నాగరాజు(33) ఎదురుగా బైక్‌ను ఢీకొట్టడంతో సాంబయ్య మృతిచెందాడు.
News February 18, 2026
HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
News February 18, 2026
నెల్లూరులో కనిపించిన నెలవంక.. టైమింగ్స్ ఇవే

నెల్లూరు జిల్లాలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. చిన్నాపెద్ద తేడా లేకుండా కఠోర ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గురువారం సమయాలు ఇలా ఉన్నాయి.
సహరి: ఉదయం 5.12గంటలకు
ఇప్తార్: సాయంత్రం 6:16 గంటలకు


