News March 8, 2025
సిద్దిపేట: ఎల్ఆర్ఎస్‌పై ప్రిన్సిపల్ సెక్రెటరీ వీసీ

LRSపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. ఈనెల చివరిలోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులని పూర్తిచేయాలని అన్నారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో కాల్ సెంటర్ ఓపెన్ చేయాలని సూచించారు. కలెక్టర్ మనూచౌదరి హజరయ్యారు.
Similar News
News March 21, 2025
వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
News March 21, 2025
కలెక్టరేట్‌లో ఆల్ పార్టీ మిటింగ్

ఎన్నికల సమయంలోనే కాకుండా క్రమం తప్పకుండా సమావేశమై అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలను, సూచనలను పరిగణలోనికి తీసుకోని భారత ఎన్నికల కమిషన్‌కు పంపుతామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌లో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గౌతం సమావేశమయ్యారు.
News March 21, 2025
నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిబ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.