News December 2, 2025
సిద్దిపేట: ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు!

సిద్దిపేట జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలం అక్కన్నపేట. అందులో 15 గిరిజన జీపీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు మూడో విడతకు ఎంపికైంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలు కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు తగ్గేదే లేదంటూ బరిలోకి దిగుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఈసారి యువకులు ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News February 12, 2026
విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్ ఇస్తుందో చూడాలి.
News February 12, 2026
మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 12, 2026
మంత్రాలయ మహాత్యం

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


