News November 20, 2025
సిద్దిపేట: కూతురి పెళ్లికి ఊరంతా పట్టు చీరలు

కూతురు పెళ్లికి ఊరంతా పట్టు చీరలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు బద్దిపడగకు చెందిన తడిసిన ప్రశాంత్ రెడ్డి. వ్యాపార రిత్యా HYDలో స్థిరపడ్డ ప్రశాంత్ రెడ్డి ఇటీవల బహ్రెయిన్ దేశంలో కూతురు వివాహం జరిపించారు. బుధవారం బద్దిపడగలో విందు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 1300 మంది మహిళలకు నూతన వధూవరుల చేత పట్టు చీరలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. తాము పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
Similar News
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 20, 2026
వరంగల్: SBI ఏటీఎంలో చోరీ.. నిందితుల ARREST

వరంగల్ పరిధి శంభునిపేట SBI ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులు యూపీకి చెందిన వినయ్ కుమార్, వినీత్ కుమార్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.27 లక్షల నగదు, రెండు మొబైల్స్, ఒక వీసా ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. మంగళవారం మట్వాడ ఏఎస్పీ ఆఫీస్‌లో నిందితులను మీడియాకు చూపారు. కాజీపేటకు చెందిన కాళేశ్వరవు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసును ఛేదించామన్నారు.
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.


