News November 20, 2025
సిద్దిపేట: కూలి రూపం.. హిడ్మా మరో కోణం!

మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే హిడ్మా జీవితంలో, మరొక కోణం దాగి ఉంది. పదేళ్ల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు టన్నుల్లో కూలి రూపంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో కూలిగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు చేశాడన్న విషయం తర్వాత పోలీసులకు అర్థమైంది. హిడ్మా మరణంతో ఈ విషయాలు బయటపడుతున్నాయి.
Similar News
News January 21, 2026
సంగారెడ్డి: నేడు సదరం శిబిరం

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 10 గంటలకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆన్ లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం శిబిరానికి హాజరు కావాలని చెప్పారు. చరవాణికి వచ్చిన సందేశంతో శిబిరానికి హాజరుకావాలని పేర్కొన్నారు.
News January 21, 2026
రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్!

ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్‌తో దావోస్‌లో CM చంద్రబాబు భేటీ అయ్యారు. ‘రక్షణ, ఏరోస్పేస్, UAV పర్యావరణ వ్యవస్థలు, డీశాలినేషన్, సెమీకండక్టర్, క్వాంటం లీడర్‌షిప్, వైద్యం, విద్య, సైబర్ సెక్యూరిటీలో అవకాశాలపై చర్చించాం. మెడ్-టెక్, ఏరో-డిఫెన్స్, క్లీన్-టెక్ కంపెనీలకు ఆతిథ్యమివ్వడానికి రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ప్రతిపాదించాను’ అని ట్వీట్ చేశారు.
News January 21, 2026
ఏడేడు జన్మల బంధం సాధ్యమేనా?

భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెబుతున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవచింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు, ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం.


