News May 14, 2024

సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో శత శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.

Similar News

News December 17, 2025

మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

image

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

మెదక్ జిల్లాలో 90.68% పోలింగ్

image

మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.68 % పోలింగ్ నమోదైంది. మొదటి, రెండవ విడత కంటే మూడవ విడత ఓటింగ్ పెరిగింది. ఈసారి నర్సాపూర్ మండలలో ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చిలప్ చెడ్ – 90.02%,
కౌడిపల్లి – 90.80%,
కుల్చారం – 89.20%,
మసాయిపేట – 88.90 %,
నర్సాపూర్ – 93.38%,
శివంపేట – 92.57%,
వెల్దుర్తి – 87.62 % నమోదైంది.

News December 17, 2025

BREAKING: మెదక్ జిల్లాలో తొలి ఫలితం

image

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చిలిప్ చేడ్ మండలం గుజిరి తండా గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రామావత్ సుజాత ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మూడావత్ రుక్మిణిపై 14 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆమె గెలుపొందారు. సుజాత విజయం ఖరారు కావడంతో అనుచరులు, పార్టీ నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ గ్రామంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.