News March 11, 2025
సిద్దిపేట: కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో ఇటు శాసనసభలో అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై ప్రధానంగా దిశా నిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.
News January 13, 2026
GWL: ఈనెల 27 నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడ్ వద్ద కొలువై ఉన్న జమ్ములమ్మ, పరశురామస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ఉ.11 గంటలకు అమ్మవారిని ఆహ్వానించేందుకు గుర్రంగడ్డ గ్రామానికి బండి వెళ్లనుంది. 28న ఉదయం 6 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) పౌర్ణమి నాడు భారీ జాతర, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
News January 13, 2026
డీజీపీ పెంపే లక్ష్యంగా స్వర్ణాంధ్ర@2047: కలెక్టర్

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (డీజీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర@2047 జిల్లా విజన్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతీ విభాగంలో కనీసం 15 శాతం పురోగతి సాధించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.


