News October 5, 2025
సిద్దిపేట: జి.వెంకటస్వామికి కలెక్టర్ నివాళి

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జి.వెంకటస్వామి జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రహమాన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
MBNR: ఎంవీఎస్ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు.
News January 23, 2026
VKB: 1800-102-7222కు కాల్ చేయండి

జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్-12లో 106 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరిలో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. యజమానులు 14ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1908, 1800-102-7222, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 23, 2026
విశాఖ: మద్యం డబ్బుల కోసం RTC బస్సు చోరీ

మద్యం డబ్బుల కోసం ఓ వ్యక్తి APSRTC బస్సును దొంగిలించాడు. ఈ ఘటన జనవరి 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అనకాపల్లి (D) మారేడుపూడికి చెందిన పైడిరాజును ఈనెల 19న పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.


