News August 21, 2025
సిద్దిపేట: ‘పశువుల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి’

పశువుల సంరక్షణకు శాఖాపరమైన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కె. హైమావతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పశువుల మేత కొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 18, 2026
HYD: పట్నం వచ్చినా.. మదిలో మాత్రం పల్లె జ్ఞాపకాలే!

ఉపాధి కోసం HYD బాట పట్టిన జనం, పండుగ రాగానే ఊరువైపు పరుగులు పెడతారు. పట్నంలో పరుగు తీసిన కష్టాన్ని మరిచే ఆనందం, పండగకు పల్లెల్లోనే దొరుకుతుందని చెబుతుంటారు. అమ్మ వంట, నాన్న ఆశీర్వాదం, బంధువుల ఆప్యాయత ఇవన్నీ పండగకు ఊరే చిరునామా.. కాంక్రీట్ జంగల్ HYD జీవితంలోనూ పల్లె జ్ఞాపకాలే మనసుకు ఊరటనిస్తాయి. సంక్రాంతికి ఊరెళ్లి, మళ్లీ HYD బాట పట్టిన ప్రజలు ముచ్చటిస్తున్నారు.

వరంగల్: ఏడుగురు యువకుల అరెస్టు

వరంగల్ ఆటోనగర్ హిందూ శ్మశాన వాటిక వద్ద ఆదివారం సాయంత్రం గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తున్న వంశీ పవర్, అభినవ్, మంద సాయి రిత్విక్, కలకోట్ల విశ్వ, సిరంగి దివిజ్, బొమ్మిశెట్టి ధనుష్, విగ్నేష్ విహారి అనే ఏడుగురు గురు యువకులను గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నట్లు మట్టెవాడ CI కరుణాకర్ రావు తెలిపారు. యువకుల నుంచి సుమారు 70 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.