News August 21, 2025
సిద్దిపేట: ‘ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి’

రైతు బజార్లు, మార్కెట్ యర్డులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూసుకోవాలని కలెక్టర్ కే. హైమావతి సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మార్కెట్ల ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 21, 2026
NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.
News January 21, 2026
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.
News January 21, 2026
పట్టాదారు పాసు పుస్తకాల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

పరిగి మండలంలో జరుగుతున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల పరిశీలనను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రీ సర్వే పూర్తయిన హుస్సేన్ బి అనే మహిళకు ఈ-కేవైసీ పూర్తి చేసి డ్రాఫ్ట్ పట్టా ప్రతిని ఆమెకు అందజేశారు. పాస్ పుస్తకాల జారీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


