News August 23, 2025
సిద్దిపేట: ప్రతి అంగన్వాడీకి రూ.10 లక్షల నిధులు: ఎంపీ

అక్బర్పేట్ భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో నిర్మించే అంగన్వాడీ భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 లక్షల నిధులు కేంద్రం కేటాయిస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాలకు వివక్ష చూపుతున్నారని చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు.
Similar News
News January 24, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే!

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపాలిటీల వారిగా సమన్వయ కర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. సిరిసిల్లకు తుల ఉమా, వేములవాడకు గూడూరి ప్రవీణ్, కరీంనగర్‌కు వినోద్ కుమార్, జగిత్యాలకు విద్యాసాగర్, పెద్దపల్లికి లోక బాపురెడ్డి, కోరుట్లకు నరేంద్రనాథ్, ధర్మపురికి రఘువీర్ సింగ్, చొప్పదండికి శ్రీనివాస్ యాదవ్, మెట్‌పల్లికి శ్రీకాంత్ రెడ్డి, రామగుండంకు ఈశ్వర్ లను నియమించారు.
News January 24, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితుల బంధువులకు వారసులకు (పీవోఏ) యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించినట్లు కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.
News January 24, 2026
NRPT: సంక్షేమ పథకాలపై ‘విలేజ్ విజిట్’ సర్వే: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలను ఆల్ ఇండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విజిట్ ప్రోగ్రాం ద్వారా సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తారని అన్నారు.


