News November 30, 2025
సిద్దిపేట: మొదటి రోజు 228 సర్పంచ్ నామినేషన్స్

స్థానిక ఎన్నికల సమరంలో రెండవ విడత నామినేషన్స్ ప్రక్రియ సిద్దిపేటలో ఆదివారం ప్రారంభం అయ్యింది. సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి రోజు 182 గ్రామ పంచాయితీలకు గాను 228 నామినేషన్స్ వచ్చాయి. అలాగే 1644 వార్డు మెంబెర్స్‌కి 287 నామినేషన్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
Similar News
News February 7, 2026
చిత్తూరు: ఏనుగుల దాడులకు ‘హనుమాన్’తో చెక్.!

రామకుప్పం(M)లో ఏనుగు ధాటికి పాడి <<19074524>>ఆవు<<>> మృతి చెందగా, GDనెల్లూరు నియోజకవర్గంలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. HANUMAN ప్రాజెక్ట్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్, శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది, డ్రైవర్, ఆధునిక వాహనాలు, ట్రాంక్విలైజేషన్ పరికరాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. జంతువులు నివాస ప్రాంతాల్లోకి వెళ్లగానే ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.
News February 7, 2026
ఉయ్యురు: శిడిబండిలో ఆ కులానికే ప్రత్యేకం..!

ఉయ్యూరు వీరమ్మ ఉత్సవాలలో భాగంగా నేడు 11వ రోజు శిడిబండి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో ఎస్సీ కులానికి చెందిన యువకుడిని కూర్చోబెట్టడానికి వెనక పెద్ద కారణం ఉంది. వీరమ్మ తల్లి సతీ సహగమనానికి గుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ముందుకు రాకపోవడంతో మాదిగ వర్గానికి చెందిన వారు తవ్వినట్లు ప్రతీక. అందుకే శిడి బండి ఉత్సవం రోజున ఆ కులానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
News February 7, 2026
సోమిరెడ్డికి కాకాణి సవాల్

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.


