News August 23, 2025

సిద్దిపేట: యూరియా సరఫరా చేయండి: మంత్రి పొన్నం

image

రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియ సరఫరా చేయాలని మంత్రి పొన్నం మూడు జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. శనివారం సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. యూరియా నిలువలు, సరఫరాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సరిపడా యూరియా అందేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. మండలాల వారిగా ప్రతిరోజూ యూరియా పంపిణీపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు.

Similar News

News January 13, 2026

ఖమ్మం: ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

image

ఖమ్మం శ్రీరాంనగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

News January 13, 2026

షాక్స్‌గామ్‌పై పాక్-చైనా ఒప్పందం చట్టవిరుద్ధం: ఆర్మీ చీఫ్

image

షాక్స్‌గామ్ లోయలో చైనా చేపడుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్-చైనా మధ్య 1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధం. CPEC 2.0పై ఆ దేశాల సంయుక్త ప్రకటనను మేము అంగీకరించం. అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు భారత్ అంగీకరించదు. దీనిపై MEA ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది’ అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. కాగా కారకోరం శ్రేణికి ఉత్తరాన ఈ లోయ ఉంది.

News January 13, 2026

ఘోర ప్రమాదం.. నంద్యాల జిల్లా వాసుల మృతి

image

మహబూబ్ నగర్(D) మూసాపేట మండలం గాజులపేట స్టేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. HYD నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బైకును వెనక నుంచి లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నంద్యాల(D) ముచ్చుమర్రికి చెందిన నాగమణి, బాలిక ఏశ్న మరణించారు. గాయపడిన తిరుపతయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.