News February 9, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15399170>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News February 19, 2026
NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’.. AIతో ఇక సరదాగా చదువు

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల కోసం NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలు తీర్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సాయపడే ‘టీచర్ తార’ అనే 3 స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడంతో పాటు వారు అడిగే ప్రశ్నలకు ఈ యాప్ వెంటనే AI సాయంతో సమాధానాలిస్తుంది.
News February 19, 2026
NTR: BREAKING.. ACBకి చిక్కకుండా SI ఎస్కేప్!

పోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన NTR జిల్లా వత్సవాయి SI ఉమామహేశ్వరరావు ACB దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం బాధితుడు డబ్బుతో స్టేషన్‌కు రాగా, బయట కొత్త వ్యక్తులను గమనించిన కానిస్టేబుల్ SIని అప్రమత్తం చేశారు. దీంతో SI అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన ACB అధికారులు, SI చాకచక్యంగా తప్పించుకోవడంతో ఖంగుతిన్నారు.
News February 19, 2026
రూ.50Kకే మ్యాక్‌బుక్ ఎయిర్?

మార్చ్ 4న జరిగే కంపెనీ ఈవెంట్‌లో లోకాస్ట్ మ్యాక్‌బుక్‌ను యాపిల్ లాంఛ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం మ్యాక్ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎయిర్ వర్షన్ తక్కువ ధర. అయితే అది కూడా రూ.1లక్షకు సమీపంలో ఉండగా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే డివైజ్ ధర రూ.50వేలు ఉండొచ్చని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో A18 చిప్, ai సహా పలు ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఈవెంట్‌లో 17e మొబైల్‌నూ యాపిల్ రిలీజ్ చేయనుంది.


