News May 7, 2025
సిద్దిపేట: ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి: సీపీ

ర్యాలీలు, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 13 వరకు అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించవద్దని సూచించారు. సభలు, సమావేశాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 17, 2026
‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.
News February 17, 2026
అనంత: ఫోన్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 రోజుల క్రితం నవీన్ తన మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 17, 2026
మిర్యాలగూడ: GOVT జాబ్ వదిలినా దక్కని ఛైర్‌పర్సన్ పదవి..!

కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో 17వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర అనుచరులుగా పేరు ఉంది. కాగా ఉద్యోగం వదిలేయడంతో ఛైర్‌పర్సన్ పదవి తనకే అనుకున్నారు. కానీ తనకు రాకపోవడంతో బాధతో వెనుదిరిగారు.


