News August 13, 2025
సిద్దిపేట: ‘వరదలపై అప్రమత్తంగా ఉండాలి’

వరదలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న 72 గంటల పాటు భారీ వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున, చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యలపై ఆయన మంత్రులతో కలసి ఆయా జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నుంచి కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘గొంతెమ్మ కోరికలు’ అంటే ఏమిటి?

అడగకూడని, అసంబద్ధమైన కోరికలనే ‘గొంతెమ్మ కోరికలు’ అంటారు. భారతంలో కుంతీ దేవి పేరే గొంతెమ్మగా మారింది. ఆమె కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించడం కోసం సూర్యుడిని వేడుకోగా కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదిస్తారు. దీంతో ఆమె భయంతో బిడ్డను నదిలో వదిలేస్తారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ‘కర్ణుడు పాండవుల పక్షాన రావాలి’ అంటూ సాధ్యం కాని కోరికను శ్రీకృష్ణుడిని కోరతారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 10, 2026
AIతో అమ్మాయిల లవ్.. ఆందోళనలో చైనా?

చైనాలో యువతులు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ‘AI బాయ్‌ఫ్రెండ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక ఒత్తిళ్లు, పెళ్లి పట్ల విరక్తితో కోట్లాది మంది ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పడిపోతున్న జననాల రేటును మరింత తగ్గిస్తుందని చైనా భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తెచ్చింది. చాట్‌బాట్‌ల వాడకంపై టైమ్ లిమిట్, సోషల్ వాల్యూస్ బ్రేక్‌పై నిఘా పెంచింది.
News March 10, 2026
పార్వతీపురం మన్యం జిల్లా జేసీ హెచ్చరిక

ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ యశ్వంత్ యశ్వంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు, తహశీల్దార్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


