News August 21, 2025

సిద్దిపేట: విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలి: హరీశ్ రావు

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరలోనే హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని హరీశ్ రావు అన్నారు.

Similar News

News January 21, 2026

సంగారెడ్డి: ‘భూభారతి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి’

image

సంగారెడ్డి జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

News January 21, 2026

అన్నమయ్య: మైనర్‌పై 75ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం.. చివరికి.!

image

అన్నమయ్య జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 75 ఏళ్ల వృద్ధుడికి కడప పోక్సో కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధించింది. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన ఈ కేసులో నేరం రుజువైంది. సమర్థవంతమైన దర్యాప్తుతో శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను జిల్లా SP ధీరజ్ అభినందించారు. మహిళలు, పిల్లల రక్షణలో రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు.

News January 21, 2026

సంగారెడ్డి: పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌లో చేరేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి తెలిపారు. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం స్థానిక ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.