News October 12, 2024
సిద్దిపేట: విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పండగపూట సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. నంగునూర్ మండలం మగ్ధుమ్‌పూర్‌కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(32) శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ సిద్దిపేటలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News November 5, 2024
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహా
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరితగతిన అందజేయాలని సూచించారు. కొనుగోలు సమస్యలతో రైతులు రోడ్లమీదకు రావద్దన్నారు. సోమవారం మెదక్‌లో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2024
పటాన్‌చెరు: హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్
పటాన్‌చెరు పరిధిలోని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమై విద్యార్థిని మృతదేహాన్ని బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 4, 2024
మాజీ సర్పంచ్‌ల అరెస్ట్‌లను ఖండించిన హరీశ్ రావు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని అన్నారు.