News April 12, 2025
సిద్దిపేట: వేర్వేరు కారణాలతో నలుగురు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కారణాలతో నిన్న నలుగురు సూసైడ్ చేసుకున్నారు. చిన్నకోడూరుకు చెందిన రేపాక రోహిత్(22) అప్పుల బాధతో ఇంట్లో ఉరేసుకోగా.. ములుగు మం, మామిడ్యాల R&B కాలనీకి చెందిన స్వామి(23) కడుపునొప్పి భరించలేక పురుగుమందు తాగాడు. రాయపోల్ మం. చిన్నమాసాన్ పల్లికి చెందిన యాదయ్య(59) కుటుంబ సభ్యలు మందలించారని, దుబ్బాక మం. రాజక్కపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ <<16060530>>మోహన్<<>>(50) ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నారు.
Similar News
News January 23, 2026
వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు: కలెక్టర్

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో దానిని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం (జనవరి 25) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 23, 2026
కేసీఆర్ చుట్టే ప్రశ్నలు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను HYD సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం రెండు గంటలుగా ప్రశ్నిస్తోంది. కాగా పదే పదే కేసీఆర్ చుట్టే ఆయన్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు? ఎవరు చేయమని చెప్పారు? అనే ప్రశ్నలతో పాటు ట్యాపింగ్‌కు కేసీఆర్ కారణమా? అనే యాంగిల్‌లో ప్రశ్నలు సంధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
News January 23, 2026
ధర్మపురి: మేడారం జాతరకు గవర్నర్‌కు మంత్రి ఆహ్వానం

హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నేడు జరిగిన భేటీలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మేడారం జాతరకు హాజరుకావాలని ఆహ్వానించారు. మేడారం జాతర ప్రాముఖ్యత, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని మంత్రి వివరించారు. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై కూడా చర్చ జరిగింది. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.


