News December 1, 2025
సిద్దిపేట: సప్లమెంటరీ నోటిఫికేషన్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ పీజీ సెకండియర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్పెల్ 2 సప్లమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరుగుతాయని, విద్యార్థులు ఫీజును డిసెంబర్ 22లోపు www.braouonline.in ఆన్లైన్లో చెల్లించాలని సిద్దిపేట రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు.
Similar News
News February 17, 2026
సిద్దిపేట: మహిళా మణులకే పదవులు!

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వాయ్యాయి. దీంతో కీలకమైన పదవిలో 4 మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా మేడిశెట్టి ఉమా, దుబ్బాక-ఆశ సులోచన, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-కళ్యాణ్ కర్ పద్మాభాయి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ పదవి చేపట్టారు. ఇక్కడ ఛైర్ పర్సన్‌లు కూడా మహిళలే.
News February 17, 2026
BREAKING: ఇంద్రేశం ఛైర్మన్ పీఠం BRS కైవసం

కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. రెండో రోజు 10 మంది BRS, ఇద్దరు BJP కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కోరం లభించింది. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 8వ వార్డు BRS కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్‌గా 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
News February 17, 2026
BREAKING: ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా దొడ్డ కిరణ్ మిత్ర

ఇల్లందు మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా రెండవ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. దొడ్డ కిరణ్ మిత్ర భర్త పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న వారికే అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడం విశేషం. వైస్ ఛైర్మన్‌గా పెండ్యాల రాజు ఎన్నికయ్యారు.


