News December 1, 2025
సిద్దిపేట: సమస్యాత్మక గ్రామాల్లో నిఘా

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించాలని వివరిస్తున్నారు. ఆదివారం గజ్వేల్, మిరుదొడ్డి, అక్బర్పేట్-భూంపల్లి మండలాల్లో ACPల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలను జాగృతం చేశారు.
Similar News
News February 17, 2026
వైవీయూలో మహిళలకు క్రీడా పోటీలు ప్రారంభం

యోగి వేమన విశ్వవిద్యాలయ, కళాశాల 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం వేమన క్రీడా మైదానంలో క్రీడలను వర్సిటీ కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, వ్యాయామ విద్య క్రీడాశాస్త్రాల విభాగాధిపతి డా. కె.రామ సబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో విద్యార్థినిలు, పరిశోధక విద్యార్థులు, బోధన, బోధనేతర మహిళా సిబ్బంది పోటీ పడ్డారు. విజేతలకు వ్యవస్థాపక దినోత్సవం నాడు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
News February 17, 2026
నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు: ఉపాధి అధికారిణి

జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘మెగా ప్లేస్మెంట్ & కెరీర్ ఎక్స్పో -2026’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. ఈనెల 19న ఉదయం 9 గం.నుంచి మధ్యాహ్నం 3 గం.వరకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో హాజరు కావాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళ అభ్యర్థులు అర్హులన్నారు.
News February 17, 2026
కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.


