News December 1, 2025

సిద్దిపేట: సర్పంచ్ స్థానాలకు 747 నామినేషన్లు వ్యాలిడ్

image

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లోని 163 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. మొత్తం 953 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 747 నామినేషన్లు వ్యాలిడ్‌గా తేల్చారు. వార్డు స్థానాలకు 3504 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 3429 నామినేషన్లు వ్యాలీడ్‌గా అధికారులు ప్రకటించారు.

Similar News

News February 17, 2026

హైదరాబాద్‌ గడ్డపై ప్రపంచ ప్యాకేజింగ్ ‘దంగల్’

image

64 ఏళ్ల ఐసీసీఏ (ICCA) చరిత్రలో తొలిసారి HYDకు గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యం దక్కింది. 2027 జనవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్‌తో తెలంగాణ పేరు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్‌లో మారుమోగిపోనుంది. రూ.55 వేల కోట్ల విలువైన దేశీ ప్యాకేజింగ్ రంగానికి ఈ సదస్సు ఊపిరి పోయనుంది. హైదరాబాద్ దిగ్గజాలు ఎం.ఎల్. అగర్వాల్, అంకిత్ అగర్వాల్ సారథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. రేపు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుగుతోంది.

సిద్దిపేట: 22న తెలంగాణ వీటీజీసీఈటీ ప్రవేశ పరీక్ష

image

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వీటీజీసీఈటీ (VTGCET) ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి డా.శారదా వెంకటేశ్ తెలిపారు. ఈ పరీక్ష ద్వారా 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.