News August 13, 2025

సిద్దిపేట: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పరిశీలన

image

15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌ను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ పరిశీలించారు. రాబోవు రెండు రోజులు వర్షాలు ఉన్నందున స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో కలిసి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

Similar News

News March 6, 2026

10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

image

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.

News March 6, 2026

పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

image

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2026

శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

image

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు