News September 10, 2025

సిద్దిపేట: ‘40 వేల మె.ట యూరియాకు.. 28 వేలే’

image

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 4.87 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వచ్చాయి. 40 వేల మె.ట యూరియా అవసరముండగా 28,882 మెట్రిక్ టన్నులే వచ్చింది. 20 రోజుల కిందటే వరికి యూరియా చల్లాల్సి ఉన్నా అన్నదాతలకు సరిపడే యూరియా దొరక్కపోవడంతో ఇంతవరకు చల్లలేదు. దీంతో పంట ఎదుగుదల లేక పిలకలు పెట్టక అలాగే అగిపోయింది. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది.

Similar News

News December 17, 2025

సంగారెడ్డి: ఈనెల 20న పీటీఎం: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 20న తప్పకుండా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించాలని పేర్కొన్నారు. చర్చించిన అంశాలను అనంతరం మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

News December 17, 2025

గన్నవరంలో 110 కేజీల గంజాయి స్వాధీనం

image

ఒడిశా నుంచి మహారాష్ట్ర, పూణేకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న భారీ గంజాయి రవాణాను ఈగల్ టీమ్ గన్నవరంలో భగ్నం చేసింది. ముందస్తు సమాచారంతో పొట్టిపాడు టోల్‌గేట్, గన్నవరం సెంటర్ వద్ద మాటు వేసిన బృందం మంగళవారం ఓ కారును తనిఖీ చేసింది. కారులో ఉన్న 114 ప్యాకెట్లలో సుమారు 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు పరారయ్యాడు. పూణేకు చెందిన దీపక్ అబాజీ తుపేను అదుపులోకి తీసుకున్నారు.

News December 17, 2025

సూర్య నమస్కారాల్లో 108 విశిష్టత..

image

సూర్య నమస్కారాన్ని 9 సార్లు ఆచరిస్తే.. ఎంతో ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఒక్క సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. అలా.. 12 భంగిమలు * 9 సూర్య నమస్కారాలు = 108 అవుతుంది. ఈ సాధన మన మనసు, శరీరం ప్రకృతితో సమానంగా ఒకే తాటిపై నడిచేలా చేసి, ప్రశాంతంగా, శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుందట. శ్వాస వ్యాయామాలు, ఇతర ఆసనాలను 108 సార్లు సాధన చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు పండితులు.