News February 10, 2025

సిద్దిపేట: 4,02,154 సూర్య నమస్కారాలతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్

image

సిద్దిపేటలో వ్యాసమహర్షి యోగా సోసైటీ, జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శత సహస్ర సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా వివిధ జిల్లాలకు చెందిన యోగా అభ్యాసకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 1484 మంది సాధకులు పాల్గొని 4,02,154 సూర్య నమస్కారాలు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు.

Similar News

News February 17, 2026

సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. నేడే తుది తీర్పు

image

2002లో <<18340301>>సంచలనం సృష్టించిన<<>> సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతేడాది నవంబర్‌లో SC రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

News February 17, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 17, 2026

స్ కోచ్ చెన్నకేశవులకు కోనేరు హంపి ప్రశంసలు

image

విజయవాడలో నిర్వహించిన శాప్ లీగ్ మహోత్సవంలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్ అవార్డు గ్రహీత, చెవిటికల్లుకు చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులను ఆమె అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని కోరారు. కఠిన సాధనతోనే చదరంగంలో ఛాంపియన్‌లుగా ఎదగగలరని హంపి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.