News October 5, 2025
సిద్దిపేట: 71 ఏళ్ల నుంచి ఆ గ్రామం ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోలేదు..!

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామం 71 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోలేదని స్థానికులు తెలిపారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కూడా రిజర్వేషన్ ఇవ్వడం లేదన్నారు. 1954 నుంచి 2025 వరకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ కల్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ అవకాశం కల్పిస్తే ఇక్కడి నుంచి ఎస్సీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News January 15, 2026
NTVపై చర్యలకు కారణం ఇదేనా?

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.
News January 15, 2026
పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.
News January 15, 2026
సూర్య మూవీకి రూ.85 కోట్ల OTT డీల్!

హీరో సూర్య, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.85 కోట్లకు OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యధికమని సమాచారం. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య లాస్ట్ మూవీ ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయిన మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.


