News March 7, 2025

సిద్దిపేట: KCR అధ్యక్షతన BRS సన్నాహక సమావేశం

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27న జరిపే బహిరంగ సభకు సంబంధించిన విషయాలపై సన్నాహక సమావేశంలో చర్చించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

ఈ సీజన్‌లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News December 12, 2025

ఇనుగుర్తి సర్పంచ్‌గా తమ్మడపల్లి కుమార్

image

ఇనుగుర్తి మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన తమ్మడపల్లి కుమార్ 270 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. గురువారం రాత్రి వరకు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరికి తమ్మడపల్లి కుమార్‌కు మెజారిటీ రావడంతో ఆయన్ను విజేతగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

అనంత: ‘ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేశాడు’

image

ఉరవకొండకు చెందిన 14 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేసి గర్భవతిని చేశాడు. బొమ్మనహాళ్ మండలం శ్రీధరగట్టకు చెందిన శివమణిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ బి.మహానంది తెలిపారు. బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, గర్భవతిని చేశాడని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.