News September 10, 2025

సిద్దిపేట: RMPల వద్దకు వెళ్లకుండా చూడాలి: DMHO

image

ప్రజలు ప్రైవేట్ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని DMHO డాక్టర్ ధనరాజ్ సూచించారు. బుధవారం తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్‌లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఆరోగ్య సమస్యల పై ముఖ్యంగా ఫీవర్ కేసుల గురించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. జ్వరంతో వచ్చిన వారికి రక్త నమూనాలను సేకరించాలన్నారు.

Similar News

News December 5, 2025

NZB: జింకను వేటాడి చంపిన ముగ్గురి రిమాండ్

image

జింకను వేటాడి చంపిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు రూరల్ టౌన్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వారం రోజుల క్రితం మల్లారం శివారులో బోర్గాంకు చెందిన గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ జింకను వేటాడి చంపారు. విజయ్, వెంకటి, భూమయ్యను అరెస్టు చేయగా అనిల్ పరారీలో ఉన్నాడు. జింక కొమ్ములు, ఇనుప పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.

News December 5, 2025

బీబీపేట్: ఆ ఊర్లో ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు

image

బీబీపేట మండలం శివార్ రాంరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచి స్థానంతో పాటు మొత్తం 8 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచి పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా ధరణి లక్ష్మీశ్రీనివాస్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచి స్థానం ఏకగ్రీవం అయ్యింది. ప్రభుత్వ పథకాలను, గ్రామ సమస్యల పరిష్కారానికి, సుపరిపాలనను అందించడానికి వార్డు సభ్యుల సహకారంతో కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.